బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్
Actor ProfilePolitician

బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్
Sakshi18 Jun 2026
బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అప్పులు, ఫెడరల్‌ రిజర్వ్‌ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 37 ట్రిలియన్‌ డాలర్ల అప్పు భారంతో ఉంది. కొత్త ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ ద్రవ్యోల్బణాన్ని మరింత వేడెక్కనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, సీడీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే "పూర్‌ సేవర్స్‌" తమ డబ్బు విలువను నిశ్శబ్దంగా కోల్పోతారని ఆయన హెచ్చరించారు. "గోల్డ్‌ ఒక మంచి రక్షణ. 1970లలో అది విలువను నిలబెట్టుకుంది. కానీ అది కేవలం నీటిని నిల్వ చేసే సీసా లాంటిది. లీక్‌ కాకుండా కాపాడుతుంది. కానీ నిజమైన ధనవంతులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడే ఆస్తులను ఎంచుకుంటారు" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, గోల్డ్‌ మాత్రమే కాదు, చరిత్రలో ద్రవ్యోల్బణం వల్ల మరింత పెరిగిన మూడు ప్రత్యేక ఆస్తులు ఉన్నాయని, వాటిని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. తిరుమల శ్రీవారి సేవలో మా ఇంటి బంగారం టీమ్.. (ఫోటోలు) వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ లాంఛ్.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్(ఫోటోలు) TG20: తెలంగాణ టీ20 లీగ్‌.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు) నాన్‌స్టాప్ పాలనలో సీఎం విజయ్‌! దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు) ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు) తాగు.. ఊగు... ఇదే బాబు గారి గ్రేట్ విజన్! MS నారాయణ సాల్మన్ రాజును మించిపోయారు మంత్రిగారు రైతులకు ఎప్పుడూ కష్టాలే..అధికారంలో ఉన్న బాబు వేస్ట్ గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?