
Maa Inti Bangaram : సమంత లీడ్ రోల్‌లో నటించిన మూవీ ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా 43 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. Samantha : నా బిడ్డే నా ప్రపంచం.. ఏళ్ల పాటు.. సమంత ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 25 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను చేరుకోవాలంటే 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన మరో ఏడు కోట్లు వసూళ్లను మా ఇంటి బంగారం సాధిస్తే బ్రేక్ ఈవెన్ ను చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీకి ఉన్న బజ్‌ను చూస్తుంటే ఈ రోజే బ్రేక్ ఈవెన్‌ను చేరుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Meher Ramesh-pawan kalyan : కూతురి పెళ్లికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన మెహర్ రమేష్.. ఫోటోలు వైరల్.. గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ మూవీని నిర్మించింది. #MaaIntiBangaaram grosses 43 CRORES WORLDWIDE IN 3 DAYS 🔥🔥 A massive weekend at the box office with families owning the film ❤️ Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MaaIntiBangaaram in theatres today ❤🔥 Book your tickets