బే ఏరియాలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్
Actor ProfileActor

బే ఏరియాలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బే ఏరియాలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్
Telugu Times27 Aug 2026
బే ఏరియాలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జోసే నగరంలో ప్రవాస తెలుగు సమాజం మునుపెన్నడూ లేని విధంగా సంగీత సాగరంలో తేలియాడింది. సంగీత దర్శకుడు, సింగర్, నటుడు, స్టేజ్ పర్ఫార్మర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ శాHజోసే సివిక్ ఆడిటోరియంలో అత్యంత అట్టహాసంగా జరిగింది. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), బే ఏరియా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రముఖ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, అపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ టిక్కెట్లన్నీ పూర్తిగా అమ్ముడైపోయి.. వేలాది మంది సంగీత ప్రియుల మధ్య ఒక చారిత్రక ఉత్సవంలా సాగింది. డీఎస్‌పీ స్టేజ్‌పైకి అడుగుపెట్టిన తొలి క్షణం నుంచే తనదైన ఎనర్జీతో, అద్భుతమైన చార్ట్‌బస్టర్ పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ ప్రదర్శనలో ఆయన ఏమాత్రం అలసట లేకుండా పాడుతూ, డాన్స్ చేస్తూ, ప్రేక్షకులతో ముచ్చటిస్తూ పవర్‌హౌస్ పర్ఫార్మెన్స్‌లతో హోరెత్తించారు. ఈ మరపురాని సంగీత రాత్రిలో రాక్‌స్టార్ డీఎస్‌పీతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకులు కార్తీక్, సమీరా భరద్వాజ్, రీటా, సాగర్ , ప్రతిభావంతులైన డాన్సర్లు బృందం అంతా కలిసి స్టేజ్‌పై సరికొత్త వెలుగులు నింపారు. ‘ఎల్లమ్మ’ సినిమాతో నటుడిగా.. ఈ సంగీత విభావరి వేదికగా దేవిశ్రీ ప్రసాద్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో రాబోతున్న ‘ఎల్లమ్మ’ చిత్రం ద్వారా తాను వెండితెరకు నటుడిగా పరిచయమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ.. 1999లో సంగీత దర్శకుడిగా తన మొదటి సినిమా ‘దేవి’ అమ్మవారి పేరుతోనే ప్రారంభమైందని, ఇప్పుడు నటుడిగా తన మొదటి సినిమా కూడా ‘ఎల్లమ్మ’ అమ్మవారి చుట్టూనే సాగడం విశేషమని అన్నారు. ఈ సరికొత్త అధ్యాయం కూడా అంతే

బ ఏర య ల ర క స ట ర ద వ శ ర ప రస ద మ య జ కల మ య జ క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in