బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
Actor ProfilePolitician

బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
Andhra Jyothy11 Aug 2026
బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు

వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వనపర్తి, జూన్ 29: వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సు సోమవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులతో పాటు స్థానికులు వెంటనే స్పందించి.. వారిని పెబ్బేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులతోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే బోల్తా పడిన బస్సును రహదారిపై నుంచి తొలగించారు. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు

బస స బ ల త 30 మ ద ప రయ ణ క లక గ య ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in