బసవతారకం క్యాన్సర్ హాస్పటల్.. ఒక మహోన్నత మానవతా ఉద్యమం
Actor ProfilePolitician

బసవతారకం క్యాన్సర్ హాస్పటల్.. ఒక మహోన్నత మానవతా ఉద్యమం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బసవతారకం క్యాన్సర్ హాస్పటల్.. ఒక మహోన్నత మానవతా ఉద్యమం
TeluguOne4 Jul 2026
బసవతారకం క్యాన్సర్ హాస్పటల్.. ఒక మహోన్నత మానవతా ఉద్యమం

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చేపట్టిన మానవతా ఉద్యమంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం. నాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉద్యమంగా ముందుకు తీసుకువచ్చిన ఆయన సమాజంలో పేదరికంతో బాధపడుతున్న ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించాలనే సంకల్పంతో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. తన జీవిత భాగస్వామి అనుభవించిన ఆ క్యాన్సర్ వేదనను మరే పేద కుటుంబం అనుభవించకూడదన్న పట్టుదలతో ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని స్థాపించారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవ ఉద్యమమైతే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒక గొప్ప మానవతా ఉద్యమం. ఈ రెండు సంస్థల స్థాపన వెనుక ఎన్టీఆర్ దూరదృష్టి, గొప్ప సేవా తత్వం దాగి ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి.. సిల్వర్ జూబ్లీ వేడుక సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని.. గత పాతికేళ్లుగా ఈ ఆసుపత్రి లక్షలాది మంది క్యాన్సర్ బాధితుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతూ, ఒక కొండంత ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు. మధ్యతరగతి ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమన్న ఆయన.. నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేశారనీ, అది నాడు ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడులపై ఉన్న అపార గౌరవానికి నిదర్శనమనీ చెప్పారు. ఆస్తులకు వారసులు ఎందరో ఉంటారు కానీ.. తల్లిదండ్రుల మహోన్నత ఆశయాలకు వారసులు కొందరే ఉంటారు. ఆ ఆశయాలను అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్నారు నందమూరి బాలకృష్ణ అని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశంసించారు. ఒక చిన్న మొక్కగా ప్రారంభమైన ఈ సేవా క్షేత్రం నేడు ఒక మహా వృక్షంగా మారింది. కేవలం 100 పడకలతో మొదలైన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, నేడు ఏకంగా 650 పడకల

బసవత రక క య న సర హ స పటల ఒక మహ న నత మ నవత ఉద యమ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in