బసవతారకం ఆసుపత్రి పేదవర్గాలకు నిజమైన గుండె ధైర్యం
Actor ProfilePolitician

బసవతారకం ఆసుపత్రి పేదవర్గాలకు నిజమైన గుండె ధైర్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బసవతారకం ఆసుపత్రి పేదవర్గాలకు నిజమైన గుండె ధైర్యం
Eenadu3 Jul 2026
బసవతారకం ఆసుపత్రి పేదవర్గాలకు నిజమైన గుండె ధైర్యం

హైదరాబాద్‌: బసవతారకం ఆసుపత్రిని ఎంతోమంది క్యాన్సర్‌ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.. ప్రభుత్వాలు, పార్టీలు అండగా నిలిచాయని చెప్పారు. బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు. ‘‘క్యాన్సర్‌తో భార్య చనిపోయాక ఎన్టీఆర్‌ ఎంతో బాధపడ్డారు. అలాంటి రోగులకు అండగా ఉండాలని కోరుకున్నారు. బసవతారకం ఆసుపత్రిని అప్పటి ప్రధాని వాజ్‌పేయీ ప్రారంభించారు. మధ్యలో అనేక సమస్యలు వచ్చినా బాలకృష్ణ సమర్థంగా నిర్వహించారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా క్యాన్సర్‌ ఆసుపత్రిని తరచుగా సందర్శిస్తారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఏటా 8వేల మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక క్యాన్సర్‌ శిబిరాలు నిర్వహించారు. పేదవర్గాలకు ఈ ఆసుపత్రి నిజమైన గుండె ధైర్యంగా మారింది. దేశంలో క్యాన్సర్‌తో ఏటా 9 లక్షల మంది చనిపోతున్నారు. ఈ వ్యాధి బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతోంది. కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి ఆసుపత్రులు పెట్టాలి’’అని చంద్రబాబు పిలుపునిచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘బసవతారకం ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని ప్రశంసిస్తున్నా. బసవతారకం ఆస్పత్రికి విరాళాలు అందించే వారికి అభినందనలు. దేశంలో విద్య, వైద్యం.. మిషనరీ స్పిరిట్‌తో పనిచేయాలి. రాచపుండు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. క్యాన్సర్‌ నివారణకు కేంద్రం, రాష్ట్రం చర్యలు చేపట్టాలి. క్యాన్సర్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి’ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

బసవత రక ఆస పత ర ప దవర గ లక న జమ న గ డ ధ ర య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in