సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ గ్లోబ్ ట్రాటర్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, క్యారెక్టర్ పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ను రాజమౌళి పంచుకున్నారు.‘వారణాసి’ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు.. ఇటీవల ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్లారు. మరోవైపు రాజమౌళి తన కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయతో కలిసి ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’కు వెళ్లారు. ఈ సందర్భంగా జక్కన్న ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వారణాసి’ షూటింగ్ మరో మూడు లేదా నాలుగు నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు. ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ అంతా పూర్తయిన్నట్లు తెలిపారు.“వారణాసి’ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలింది అనుసంధాన సన్నివేశాలు మాత్రమే. 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఆశిస్తున్నాము” అని రాజమౌళి తెలిపారు. ఇక ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తే అద్భుతంగా ఉంటుందని అనుకున్నానని దర్శకుడు చెప్పారు. కేవలం ఐమాక్స్ కోసం ఫార్మాట్ చేయడం కాకుండా, ఐమాక్స్ ఫార్మాట్‌లో నే తీయాలని అనుకున్నామని, అలా అని దాని కోసం స్టోరీలో మార్పులేమీ చేయలేదని, చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమే చేశామని జక్కన్న వెల్లడించారు.* ‘బాహుబలి టార్చ్ బేరర్’ ఓటీటీ స్ట్రీమింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి.. వీడియో వైరల్“మన కళ్లు సినిమా స్కోప్ ఫార్మాట్‌లో షూట్ చేయడానికి అలవాటు పడ్డాయి. నాకు కూడా అది ఇష్టమే. అయితే ‘వారణాసి’ చిత్రాన్ని అటు ఐమ్యాక్స్, ఇటు సినిమా స్కోప్ ఫార్మాట్‌కు సరిపోయేలా సన్నివేశాలను ఫ్రేమ్ చేయాలని
Actor ProfileActor
ఫ్రాన్స్ వేదికగా వారణాసి’ అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి.. షూటింగ్ పూర్తయ్యేది అప్పుడే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•27 Jul 2026
ఫ్రాన్స్ వేదికగా వారణాసి’ అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి.. షూటింగ్ పూర్తయ్యేది అప్పుడే