ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు
Actor ProfilePolitician

ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు
AP7AM27 Jun 2026
ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు

కాకినాడ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఫ్రిజ్‌లో నుంచి చల్లటి నీరు తీసుకురావడం ఆలస్యమైందన్న ఆగ్రహంతో కన్నతల్లినే ఓ కుమారుడు హతమార్చాడు. పిఠాపురం మండలం చిత్రడ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఈ నెల 9వ తేదీన జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన పెంట నాగమణి (45), కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.పోలీసుల కథనం ప్రకారం.. చిత్రడ గ్రామంలోని ఈబీసీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు రాజబాబుకు అతని తల్లి నాగమణి భోజనం వడ్డించారు. ఆ సమయంలో అతను ఫ్రిజ్‌లో నుంచి చల్లటి నీళ్లు కావాలని అడగ్గా, ఆమె తీసుకురావడం కాస్త ఆలస్యమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజబాబు, తానే వేగంగా ఫ్రిజ్ వైపు వెళ్లగా, ఆ తలుపు తగిలి స్వల్ప గాయమైంది. దీంతో మరింత ఆవేశానికి గురైన అతను, తల్లి నాగమణిని పట్టుకుని ఇంట్లోని పూజ గదిలో ఉన్న చెక్క బల్లకు ఆమె తలను బలంగా కొట్టాడు.ఈ దాడిలో నాగమణి తలకు తీవ్ర గాయమై, అధిక రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన ఆమె భర్త త్రిమూర్తులు, రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను గమనించి బంధువుల సాయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జూన్ 9 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారు.ఈ ఘటనపై పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లోకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి చిన్న

ఫ ర జ వ టర త స క ర ల దన తల ల న చ ప శ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in