
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సలార్, కల్కి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ రేంజ్ గ్లోబల్ లెవెల్ కి వెళ్లిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సలార్, కల్కి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ రేంజ్ గ్లోబల్ లెవెల్ కి వెళ్లిపోయింది. అయితే, ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ ఏడాది వచ్చిన రాజాసాబ్ మూవీ.. సాధారణ ఆడియన్స్ కే కాకుండా, డార్లింగ్ ఫ్యాన్స్ కు కూడా కాస్త నిరాశే మిగిల్చింది. సలార్, కల్కి విజయాల తర్వాత ముచ్చటగా మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ పూర్తి చేస్తాడు అనుకున్న అభిమానులకు ఆ అంచనాలు అందుకోలేకపోవడం కాస్త బాధ కలిగించే విషయమే. కానీ, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ప్రభాస్‌కు కొత్తేమీ కాదు. అందుకే ఇప్పుడు ఆయన తదుపరి సినిమాలపై మునుపటి కంటే రెట్టింపు స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ లైనప్‌లో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్... డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ. మిగతా సినిమాల లెక్క వేరు, ఈ సినిమా లెక్క పూర్తిగా వేరు. అద్భుతమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైలే సెపరేట్. ఇందులో ప్రభాస్ ఒక వైపు వీరత్వం ఉట్టిపడే యుద్ధ సైనికుడిగా, మరోవైపు ప్రాణమిచ్చే ప్రేమికుడిగా రెండు భిన్నమైన పవర్‌ఫుల్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ వరుసగా వస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. కానీ, ఫౌజీ సినిమాకు సంబంధించి మాత్రం గతేడాది వచ్చిన ఆ ప్రీ-లుక్ పోస్టర్ మినహా మేకర్స్ నుంచి ఇంకో కొత్త అప్‌డేట్ బయటకు రాలేదు. అసలు ఈ సినిమా ఏ స్టేజ్‌లో ఉంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. అయితే, తాజాగా ఇండస్ట్రీ