
Meloni on Photo Claim | ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫొటో దిగడానికి ఉబలాటపడ్డారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఆయన వ్యాఖ్యల్ని మెలోని ఖండించారు. తానెప్పుడూ ఫొటో కోసం ప్రాధేయపడలేదని పేర్కొన్నారు. ఇలా చెప్పుకోవడం ట్రంప్‌నకు ఇదేం కొత్తకాదంటూ మండిపడ్డారు. ఇటాలియన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో జార్జియా మెలోని తనతో ఫొటో దిగడానికి వేడుకున్నారని ట్రంప్ అన్నారు. ఆమె పట్టుబట్టడంతో జాలిపడి ఫొటో దిగడానికి అంగీకరించానని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. తాను గానీ, ఇటలీ దేశం గానీ ఎవరినీ బతిమిలాడవని స్పష్టం చేశారు. మిత్రదేశాల పట్ల ట్రంప్ ఇలా ప్రవర్తించడంపై విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు తమ ప్రధానిని అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన జూన్ 21, 22 తేదీల్లో అమెరికాలో పర్యటించాల్సి ఉంది. గతంలో పోప్ వ్యవహారంలోనూ ట్రంప్, మెలోని మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకించిన పోప్ వ్యాఖ్యలను ట్రంప్ తప్పుబడుతూ.. వామపక్ష తీవ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదంటూ మెలోని ఖండించారు. ఇరాన్ విషయంలో తన చర్యలను విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ఆమెకు ధైర్యం లేదని విమర్శించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర