ఫోక్ సాంగ్స్ నుంచి హీరోయిన్ వ ర కు.. ఇండ స్ట్రీకి మ రో సాయిప ల్ల వి
Actor ProfileActor

ఫోక్ సాంగ్స్ నుంచి హీరోయిన్ వ ర కు.. ఇండ స్ట్రీకి మ రో సాయిప ల్ల వి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫోక్ సాంగ్స్ నుంచి హీరోయిన్ వ ర కు.. ఇండ స్ట్రీకి మ రో సాయిప ల్ల వి
Asianet News Telugu20 Jun 2026
ఫోక్ సాంగ్స్ నుంచి హీరోయిన్ వ ర కు.. ఇండ స్ట్రీకి మ రో సాయిప ల్ల వి

సోషల్ మీడియా యుగంలో అనేక మంది కళాకారులు తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో నాగదుర్గ ఒకరు. తెలంగాణ జానపద పాటల్లో ఆమె చేసిన డ్యాన్స్‌లు, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ నేపథ్యంలోని పాటల్లో కనిపిస్తూ ఆమె యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. నాగదుర్గ నటించిన అనేక ఫోక్ వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. అందమైన అభినయం, సహజమైన నటన ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. తెలుగు ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గకు తమిళ చిత్రసీమ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటిస్తున్న "లవ్ ఓ లవ్" సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. దీంతో నాగదుర్గపై తమిళ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఇప్పుడు నాగదుర్గ తెలుగు ప్రేక్షకులను హీరోయిన్‌గా పలకరించేందుకు సిద్ధమవుతోంది. ప్రియదర్శి హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో ఆమె కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు వంశీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. తెలంగాణ కుటుంబ కథా నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 25న పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుండగా, జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ నేపథ్య కథలో నిజమైన తెలంగాణ అమ్మాయిని హీరోయిన్‌గా ఎంపిక చేయడం సినిమాకు మరింత సహజత్వాన్ని తీసుకురానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నాగదుర్గ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న చర్చ ఇదే. ఆమె రూపురేఖలు, సహజమైన అందం, తక్కువ మేకప్‌తో కనిపించే తీరు చాలామందికి సాయి పల్లవిని గుర్తు చేస్తున్నాయి. సాయి పల్లవి తన సహజమైన నటన, మేకప్‌కు దూరంగా ఉండే వ్యక్తిత్వంతో ప్రేక్షకుల