ఫడణవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడం
Actor ProfilePolitician

ఫడణవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫడణవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
Andhra Jyothy19 Aug 2026
ఫడణవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడణవిస్‌తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడణవిస్‌తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు ఫలించాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు.శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమల్లో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా