పైసల వేటలో.. పరిశోధన గాలికి
Actor ProfilePolitician

పైసల వేటలో.. పరిశోధన గాలికి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పైసల వేటలో.. పరిశోధన గాలికి
Andhra Jyothy30 Jul 2026
పైసల వేటలో.. పరిశోధన గాలికి

మనదేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా.. వైద్య రంగంలో పరిశోధనల విషయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉన్నామని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. వైద్య పరిశోధనల్లో అట్టడుగున భారత్‌.. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో లాభాలకే ప్రాధాన్యం టాప్‌ ఆస్పత్రుల్లో ఏటా సగటున 48 పరిశోధనలే.. చైనా, అమెరికా, బ్రిటన్‌లో 2-3 వేలు మనదేశంలో రోగుల డేటా కూడా అస్తవ్యస్థం.. తాజా అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మనదేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా.. వైద్య రంగంలో పరిశోధనల విషయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉన్నామని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. దేశంలోని 60 శాతం జనాభాకు అనుబంధ వైద్య కళాశాలలు లేని ప్రైవేటు ఆస్పత్రులే వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ ఆస్పత్రులు పరిశోధనలను పూర్తిగా గాలికొదిలేశాయని ‘జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎవిడెన్స్‌’లో డాక్టర్‌ సమీరన్‌ నంది, పరమానంద్‌ తివారీ అనే పరిశోధకులు ప్రచురించిన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోవిద్యాబోధన, పరిశోధనలకు తావు లేకుండా పోతోందని విమర్శించారు. వైద్య పరిశోధనల్లో అమెరికా, బ్రిటన్‌, చైనా అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్‌లోని టాప్‌ 50 ప్రైవేటు ఆస్పత్రులు (వీటికి అనుబంధ మెడికల్‌ కాలేజీలు లేవు) ఏడాదికి ఒక్కొక్కటి సగటున 48 పరిశోధనా పత్రాలను మాత్రమే ప్రచురిస్తున్నాయి. అదే అమెరికాలోని ప్రముఖ ఆస్పత్రులు సగటున 2,898, చైనాలో 3,220, బ్రిటన్‌లో 2,701 పత్రాలను ప్రచురిస్తున్నాయని వారు తెలిపారు. మనదేశంలో అనుబంధ మెడికల్‌ కాలేజీలున్న ఆస్పత్రులు ఒక్కొక్కటి సగటున ఏటా 338 పత్రాలను ప్రచురిస్తున్నప్పటికీ అంతర్జాతీయ పరిశోధనలతో పోల్చితే ఇవి ఏమాత్రం సరిపోవని పేర్కొన్నారు. అమెరికాలోని ‘మయో క్లినిక్‌’ ఒక్కటే ఏడాదికి 8 వేల వరకు పరిశోధనా పత్రాలను విడుదల చేస్తోంది. మనదేశంలోని మొత్తం ప్రైవేటు వైద్య రంగం కలిపి కూడా ఇన్ని ప్రచురించకపోవటం గమనార్హం. దేశంలో మెడికల్‌ కాలేజీలు లేని 99.9 శాతం ఆస్పత్రులు ఏడాదికి కనీసం 10 పరిశోధనా

ప సల వ టల పర శ ధన గ ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in