పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం
Actor ProfilePolitician

పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం

Total News1
Movie Updates0
Sources1
పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం
HMTV15 Jun 2026
పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం

Rajahmundry: పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం: రూ. 11 కోట్లతో ఆలయాల అభివృద్ధి! రాజమండ్రి: రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు. అందునా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మరింతగా ఆధ్యాత్మిక శోభ తీసుకు వస్తున్నట్లు ఆయన చెప్పరు. ఇప్పటికే ఎండోమెంట్స్ శాఖ ద్వారా ₹9.10 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభమయ్యాయని, తాజాగా మరో ₹2.36 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. దీంతో మొత్తం రూ 11.46 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. తిలక్ రోడ్డులోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు, ఎండోమెంట్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఉమా మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, గౌతమి గోరక్షణ సంఘం, గౌతమి జీవకారుణ్య సంఘం, శ్యామలాంబ అమ్మవారి ఆలయం, మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సహా అనేక దేవాలయాలకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే వాసు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్సించారు. పుష్కరాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, విద్యుత్ అండర్ గ్రౌండ్ కేబులింగ్, అమృత్ 2.0 ద్వారా తాగునీటి ప్రాజెక్టులు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వంటి పనులు చేపడుతున్నామని చెప్పారు. క్వారీ ప్రాంతానికి 95 కోట్ల రూపాయలతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే వాసు తిప్పికొడుతూ, వాళ్ళు రీల్ స్టార్స్ రియల్ స్టార్స్ అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని వైసిపి వాళ్ళు ఇప్పుడు డీఎస్సీపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని గుర్తుచేశారు. అధికారంలో