పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో
Actor ProfileActor

పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది
Asianet News Telugu20 Jul 2026
పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది

స్టార్ యూట్యూబర్, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. వైష్ణవి చొడిశెట్టితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్, వైష్ణవి పెళ్లి జూన్ 21న తిరుమల శ్రీవారి సాక్షిగా జరిగింది. ఎటువంటి హడావిడి లేకుండా ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, సన్నిహితులు,స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించారు. పెళ్లి తర్వాత విశాఖపట్నంలోని వారి స్వగృహం వద్ద గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం షణ్ముఖ్-వైష్ణవి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో సెలైన్ తో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. ఆస్పత్రిలో చేరినట్లు కనిపించడంతో షణ్ముఖ్ కు ఏమయ్యిందా అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫోటోను షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఆయనకు సెలైన్ ఎక్కిస్తున్నట్లు కనిపించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితి గురించి కానీ.. ఆస్పత్రిలో చేరడానికి గల కారణం గురించి షణ్ముఖ్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు షణ్ముఖ్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఆయనకు ఏమైందా అని ఆందోళన చెందుతున్నారు. అయితే పెళ్లి, రిసెప్షన్ వంటి వరుస వేడుకల కారణంగా షణ్ముఖ్ తీవ్రంగా అలసిపోయి ఉండవచ్చని, ఎండదెబ్బతో.. డీహైడ్రేషన్ లేదా నీరసం కారణంగా ఆస్పత్రికి వెళ్లి ఉండవచ్చని కొందరు అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా షణ్ముఖ్ స్పందిస్తేనే పూర్తి విషయం తెలుస్తుంది. ఇదిలా ఉంటే, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా యూత్ లో అతనికి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆ క్రేజ్‌తో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొని

ప ళ ల న మ డ ర జ లక హ స ప టల ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in