పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు
Actor ProfileActor

పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు
Sakshi30 Aug 2026
పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు

సంప్రదాయ ఆచారాలు పాటించపోతే చట్టబద్ధమైన వివాహంగా పరిగణించలేం మూడు ముళ్లు, సప్తపదిని పాటించడమే హిందూ వివాహానికి పునాది ఆచారాలు వివాహానికి పవిత్ర సంస్కారాన్ని, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తాయి అహ్మదాబాద్‌: హిందూ వివాహాల విషయంలో గుజరాత్‌ హైకోర్టు కీలకమైన తీర్పును ప్రకటించింది. పెళ్లికి రిజ్రస్టేషన్‌ ఒక్కటే సరిపోదని తేల్చిచెప్పింది. వివాహం అనేది కేవలం పాటలు, నృత్యాల వేడుక మాత్రమే కాదని పేర్కొంది. సప్తపది వంటి సంప్రదాయ ఆచారాలను పాటించకుండా ఒక జంట కేవలం రిజిస్ట్రేషన్తో ఒక్కటైతే అది చట్టబద్ధమైన వివాహంగా పరిగణించలేమని వెల్లడించింది. ఈ మేరకు జూన్‌ 23న తీర్పునిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతికపరమైన వైవిధ్యాలు ఉన్నప్పటికీ.. పెళ్లి తంతులో సంప్రదాయ ఆచారాలు, పద్ధతులు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్వభావాన్ని శుద్ధి చేసి, పరివర్తన చెందేలా చేస్తాయని వెల్లడించింది. తమ వివాహాన్ని చెల్లనిదిగా ప్రకటించడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)కు చెందిన కౌశల్‌ సోనార్‌ అనే వ్యక్తి గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్‌ ఐలేష్‌ వోరా, జస్టిస్‌ ఆర్‌.టి.వచానీతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. గత ఏడాది నవంబర్‌లో ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది. మూడు ముళ్లు, ఏడు అడుగులు వంటి ఆచారాలను పాటించడమే హిందూ వివాహానికి పునాది అని తేల్చిచెప్పింది. పవిత్రమైన అగ్నిసాక్షిగా వధూవరులు కలిసి ఏడు అడుగులు వేసే సప్తపది వంటి ఆచారాలు వివాహానికి ఒక పవిత్ర సంస్కారాన్ని, ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. ఏమిటీ కేసు? తాను ఎవరినీ పెళ్లి చేసుకోకపోయినా ఓ యువతి తన భార్యగా చెలామణి అయ్యేందుకు ప్రయత్నించిందని యూకేలో నివసించే కౌశల్‌ సోనార్‌ ఆరోపించాడు. ఆ యువతి అహ్మదాబాద్‌లో నివసిస్తోందని, ఆమె తన తల్లిదండ్రులను సంప్రదించి, తనను వివాహం చేసకున్నట్లుగా ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిందని చెప్పాడు. ఆ తర్వాతే

ప ళ ల క ర జ స ట ర షన ఒక కట సర ప ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in