
ఎస్పీ లేదా కమిషనర్ అనుమతి లేకుండా ఫుటేజీ తొలగింపు సాధ్యం కాదు చట్ట నిబంధనల ప్రకారం వీరి అనుమతి ఉండాల్సిందే వీరు అనుమతిచ్చినా పోలీసులు నేరుగా డిలీట్ చేయలేరు ఎస్పీ/పోలీస్ కమిషనర్ నియమించే అధికృత వ్యక్తే ఆ పని చేయగలడు గతంలో ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం సాయికృష్ణ కేసులో నెల రోజుల ఫుటేజీ మాయం కావడంపై సర్వత్రా విస్మయం అన్ని రోజుల ఫుటేజీ డిలీట్ అయ్యిందంటే పోలీసు పెద్దలకు తెలిసే జరిగిందని స్పష్టం ఫుటేజీ తొలగింపు అనేది సాక్ష్యాల తారుమారు, తుడిచిపెట్టడం కిందకే వస్తుంది ఇది చట్ట ప్రకారం నాన్ బెయిలబుల్ నేరం.. బాధ్యులను సస్పెండ్, డిస్మిస్ చేయొచ్చు నిష్పాక్షిక దర్యాప్తుతో ఫుటేజీని ఎవరు డిలీట్ చేశారో తెలుసుకోవచ్చు.. రికవరీ చేయొచ్చు సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం, కనుమరుగు వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీ మాయం కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు పెద్దల సహాయ, సహకారాలు లేకుండా సీసీ టీవీ ఫుటేజీ మాయం అయ్యే అవకాశమే లేదు. చట్ట నిబంధనల ప్రకారం సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేయాలంటే జిల్లాల్లో ఎస్పీ, కమిషనరేట్‌లలో కమిషనర్ అనుమతి తప్పనిసరి. వీరి అనుమతి లేకుండా పోలీస్‌స్టేషన్‌లలో సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేయడం ఎంత మాత్రం సాధ్యం కాని పని. ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)కు కూడా సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేసేందుకు అనుమతి ఉండదు. డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్), నెట్‌వర్క్ వీడియో రికార్డర్ (ఎన్‌వీఆర్)లలో నిక్షిప్తమయ్యే సీసీ టీవీ ఫుటేజీని తొలగించాలంటే ఎస్పీ లేదా కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. వారు నేరుగా పోలీసులకు అనుమతి ఇవ్వరు. సదరు సీసీ టీవీ ఫుటేజీని తెరిచేందుకు ఓ అధీకృత వ్యక్తిని నియమిస్తారు. ఆ వ్యక్తికి మాత్రమే దానిని పరిశీలించే, డిలీట్ చేసే అధికారం ఉంటుంది. అనుమతులు లేకుండా పోలీసులు నేరుగా