పిల్లల కోసం ట్రాక్టర్ కు ఎదురు నిలిచిన పక్షి.. వైరల్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు
Actor ProfileActor

పిల్లల కోసం ట్రాక్టర్ కు ఎదురు నిలిచిన పక్షి.. వైరల్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు

Total News1
Movie Updates0
Sources1
పిల్లల కోసం ట్రాక్టర్ కు ఎదురు నిలిచిన పక్షి.. వైరల్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు
Andhra Jyothy15 Jun 2026
పిల్లల కోసం ట్రాక్టర్ కు ఎదురు నిలిచిన పక్షి.. వైరల్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చిన్న పక్షి చూపిన తల్లిప్రేమకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చిన్న పక్షి చూపిన తల్లిప్రేమకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. లాప్‌వింగ్ (Lapwing) జాతికి చెందిన ఓ తల్లి పక్షి తన గుడ్లను కాపాడేందుకు భారీ ట్రాక్టర్‌కు ఎదురొడ్డి నిలబడిన దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. wandarlustbabbi21 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Lapwing bird viral video). వైరల్ అవుతున్న వీడియోలో ఒక పక్షి పొలంలో గుడ్లు పెట్టి వాటిని కాపలా కాస్తోంది. అదే సమయంలో రైతు ట్రాక్టర్‌తో ఆ దిశగా వస్తుండటాన్ని గమనించింది. ఆ ట్రాక్టర్ చక్రానికి ఎదురుగా నిలబడి తన రెక్కలను విప్పి గుడ్ల ముందు నిలబడింది. తన పిల్లలను రక్షించేందుకు ప్రాణాలకు తెగించి నిలిచిన ఆ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. పక్షి భయపడకుండా గుడ్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న తీరు చూసిన రైతు ట్రాక్టర్‌ను వెంటనే ఆపేశాడు (Mother bird protects eggs). ఆ తర్వాత పక్షి, గుడ్లకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడ్డాడు (Tractor viral video). ఈ ఘటనలో పక్షి మాతృత్వం మాత్రమే కాదు, రైతు చూపిన మానవత్వం కూడా ప్రశంసలు అందుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'తల్లి ప్రేమకు హద్దులు లేవు', 'మనుషులైనా, జంతువులైనా పిల్లల కోసం ప్రాణాలు అర్పిస్తారు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం.. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ