పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
Actor ProfilePolitician

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
Andhra Jyothy10 Aug 2026
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజంపేట గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజంపేట గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చి దిద్దడానికి అందరు సమిష్ఠిగా కృషి చేయలన్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తెలిపారు. జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు ప్రతి ఒక చిన్నారికి పోలియో చుక్కలు వేయలన్నారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికి తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా పోలియో కేంద్రాల ఏర్పాటు అందుబాటులో ఉన్న వాక్సిన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కామ్డె అనిల్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఆహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, సర్పంచ్‌ బుర్స పోచయ్య, తదితరులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజం కోసం అంతా కృషి చేద్దామని ఎమ్మెల్యే హరీష్‌ బాబు అన్నారు. కాగజ్‌నగర్‌లో పల్స్‌ పోలియో చుక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూరు(టి) ఎంపీడీవో కోట ప్రసాద్‌ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మండల కేంద్రంలో పలు కూడళ్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచి నాగమణి