పేలుడు పదార్థాల కేసు.. రెండో నిందితుడి
Actor ProfilePolitician

పేలుడు పదార్థాల కేసు.. రెండో నిందితుడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పేలుడు పదార్థాల కేసు.. రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు
Andhra Jyothy19 Jun 2026
పేలుడు పదార్థాల కేసు.. రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పేలుడు పదార్థాల కేసు నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడు షేక్ మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ అలియాస్ విజయకుమార్‌పై విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్‌షీట్ సమర్పించారు. విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పేలుడు పదార్థాల కేసు నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడు షేక్ మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ అలియాస్ విజయకుమార్‌పై విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్‌షీట్ సమర్పించారు. షేక్ మన్సూర్‌పై UAPA, BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1999 బాంబు పేలుడు కేసు తర్వాత తమిళనాడు నుంచి పరారైన షేక్ మన్సూర్.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటికి చేరుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో అధికారులు పేర్కొన్నారు. నకిలీ ప్రభుత్వ గుర్తింపు పత్రాలు పొంది అక్కడే నివాసం ఏర్పరచుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమనుల్లా ద్వారా తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై బాంబుల తయారీలో శిక్షణ పొందినట్లు ఆరోపించారు. పేలుడు పదార్థాలను రహస్య స్థావరానికి తరలించడంలో షేక్ మన్సూర్ సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఓ వర్గం నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు కుట్ర పన్నినట్లు గుర్తించామన్నారు. దేశంలో భయాందోళనలు సృష్టించి షరియా చట్టం అమలు లక్ష్యంగా కుట్ర పన్నినట్లు వెల్లడించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు షేక్ అమనుల్లాపై ఫిబ్రవరి 2026లోనే ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దర్యాప్తు సమయంలో అమనుల్లా ఇంట్లో పేలుడు పదార్థాలు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి

ప ల డ పద ర థ ల క స ర డ న ద త డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in