పారిస్ లో రాజమౌళికి అరుదైన గౌరవం
Actor ProfileActor

పారిస్ లో రాజమౌళికి అరుదైన గౌరవం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పారిస్ లో రాజమౌళికి అరుదైన గౌరవం
AP7AM10 Aug 2026
పారిస్ లో రాజమౌళికి అరుదైన గౌరవం

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఖాతాలో మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని వేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత 'సినెమాథెక్ ఫ్రాన్సైస్‌'లో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. ఈ సంస్థలో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ సత్కరించారు. ఈ చారిత్రక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూషన్‌లో రాజమౌళి చిత్రాలను కూడా ప్రదర్శించారు.ఈ సందర్భంగా రాజమౌళి తన ఆనందాన్ని పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. "పారిస్‌లో నా చిత్రాలను ప్రదర్శించడం, నన్ను ఇక్కడికి ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కానీ, ఇది నేను అస్సలు ఊహించని ఒక మధురమైన ఆశ్చర్యం. ఈ అనుభూతిని మాటల్లో పూర్తిగా వర్ణించలేను" అని అన్నారు."ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూషన్లలో ఒకటైన, లెజెండరీ హెన్రీ లాంగ్లోయిస్ పేరుతో ఉన్న ఈ సంస్థలో శాశ్వత స్థానం లభించడం జీవితాంతం గుర్తుండిపోతుంది. భారతీయ సినిమాను ఇంత ఆప్యాయంగా ఆదరించిన లెజెండరీ దర్శకుడు కోస్టా గావ్రాస్‌కు, సినెమాథెక్ ఫ్రాన్సైస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని రాజమౌళి తెలిపారు. రాజమౌళికి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల భారతీయ సినీ ప్రియులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు