ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్
Actor ProfileActor

ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు
TV9 Telugu28 Jun 2026
ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

డైషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బద్రి చిత్రంతో తన జైత్రయాత్రను ప్రారంభించిన ఆయన, ఇడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసి తిరుగులేని దర్శకుడిగా పేరుపొందారు. అయితే, ప్రస్తుతం పూరి హవా కొంత తగ్గిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ నేపథ్యంలో, తన తొలి బ్లాక్‌బస్టర్‌లలో ఒకటైన ఇడియట్ సినిమా వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథను ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇడియట్ సినిమా షూటింగ్ పూర్తయి, సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. దీంతో ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు ప్రివ్యూ షో వేశారు. సినిమా చూసిన వారందరూ బాగుందని చెప్పినప్పటికీ, వారి కళ్ళల్లో నిజాయితీగా ఆ సమాధానం వస్తున్నట్టు అనిపించలేదని మార్తాండ్ కే వెంకటేష్ గుర్తుచేసుకున్నారు. ప్రేక్షకులు డల్‌గా ఆన్సర్ ఇస్తుండటంతో, పూరి జగన్నాథ్ లోలోపల ఏదో లోపం ఉందని గ్రహించారు. ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది కొంతమందిని అడిగినప్పుడు, సినిమా మొత్తం ఒకే ధోరణిలో చాలా లౌడ్‌గా వెళుతుందని, ఎక్కడా ఆడియన్స్‌కు బ్రీథింగ్ స్పేస్ లేదని అభిప్రాయపడ్డారు. రవితేజ వాయిస్ కూడా ఒక కారణమని భావించారు. మరికొంతమంది సినిమా ఫ్లాప్ అవుతుంది అని కూడా చెప్పారట. ఈ అభిప్రాయాన్ని మార్తాండ్ కే వెంకటేష్‌తో సహా పలువురు పూరికి చెప్పారట. ఈ సమస్యపై పూరి జగన్నాథ్, మార్తాండ్ కే వెంకటేష్‌ను, తన కో-డైరెక్టర్‌ను పిలిచి చర్చించారట. ప్రేక్షకులు నిరాశగా ఉండటానికి గల కారణం తెలిసిన తర్వాత, ఒక వినూత్నమైన ఆలోచనను పూరి ముందుకు తెచ్చారు. "మనం మణిరత్నం స్టైల్‌లో ఫాలో అవుదామా.?"