ప్రియురాలు వైష్ణవితో ఏడడుగులు వేసిన షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు వైరల్
Actor ProfileCelebrity

ప్రియురాలు వైష్ణవితో ఏడడుగులు వేసిన షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రియురాలు వైష్ణవితో ఏడడుగులు వేసిన షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు వైరల్
Zee Telugu29 Jun 2026
ప్రియురాలు వైష్ణవితో ఏడడుగులు వేసిన షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు వైరల్

Shanmukh Jaswanth Marriage: యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసి, రన్నరప్‌గా నిలిచాడు. బిగ్ బాస్ ముందు వరకు లవ్‌లో ఉన్న షణ్ముఖ్, దీప్తి సునైనా.. ఆ తర్వాత విడిపోయారు. అయితే ఫిబ్రవరిలో తన ప్రియురాలు వైష్ణవితో ఎంగేజ్మెంట్ చేసుకున్న షన్ను.. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యాడు. షణ్ముఖ్ జస్వంత్.. సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో ఎంతో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. రాజమహేంద్రవరానికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో షన్ను పెళ్లి.. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వైష్ణవితో కలిసి షణ్ముఖ్ గృహప్రవేశం చేయడంతో రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో.. ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోల్లో పెళ్లి మండంపై నూతన వధూవరులిద్దరూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలిమ్స్,వెబ్ సిరీస్‌లతో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5లో కూడా పాల్గొన్నాడు. బిగ్ బాస్ ముందు వరకు దీప్తి సునైనా, షణ్ముఖ్.. బహిరంగంగానే తమ ప్రేమని చూపించారు. అయితే బిగ్ బాస్‌ షోలో షణ్ముఖ్.. సిరి హన్మంత్‌కి క్లోజ్‌గా ఉండటంతో దీప్తి సునైనాతో బ్రేకప్ అయిపొయింది. వీరి బ్రేకప్‌ని కూడా అఫీషియల్‌గానే ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ షణ్ముఖ్ సిరీస్‌లు