ప్రాణాలు కాపాడే చోటే పాశవికానందం.. 35 సెకన్లలో 10 సార్లు కాలితో తన్నులు.. రాయ్ బరేలీ ఆసుపత్రిలో దారుణం
Actor ProfilePolitician

ప్రాణాలు కాపాడే చోటే పాశవికానందం.. 35 సెకన్లలో 10 సార్లు కాలితో తన్నులు.. రాయ్ బరేలీ ఆసుపత్రిలో దారుణం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రాణాలు కాపాడే చోటే పాశవికానందం.. 35 సెకన్లలో 10 సార్లు కాలితో తన్నులు.. రాయ్ బరేలీ ఆసుపత్రిలో దారుణం
Zee Telugu31 Aug 2026
ప్రాణాలు కాపాడే చోటే పాశవికానందం.. 35 సెకన్లలో 10 సార్లు కాలితో తన్నులు.. రాయ్ బరేలీ ఆసుపత్రిలో దారుణం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Raebareli District Hospital: ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసే దారుణ సంఘటన జరిగింది. పింకీ అనే మహిళా స్వీపర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగితో పచ్చి బూతులు తిడుతూ.. దురుసుగా ప్రవర్తించింది. ఆప్యాయంగా చూసుకోవాల్సిన రోగిని.. విచక్షణారహితంగా కాళ్లతో తన్నింది. కేవలం 35 సెకన్ల వ్యవధిలోనే రోగిని దాదాపు 10 సార్లు తన్నుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడమే కాదు.. ప్రభుత్వ ఆసుపత్రులలోని సిబ్బంది ప్రవర్తనపై చర్చకు దారితీసింది. ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ ఈ అమానుష సంఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు.. ఆసుపత్రి యాజమాన్యం వెంటనే పింకీని సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి.. 1956 ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు, 1999 ప్రకారం ఆమెపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించారు. సస్పెన్షన్ కాలంలో, ఆమెను ఆసుపత్రిలోని ఆయుష్ ఔట్‌పేషెంట్ విభాగానికి బదిలీ చేశారు. ఈ ఘటనపై సకాలంలో నివేదిక సమర్పించేందుకు ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుష్పేంద్ర కుమార్ ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ దినేష్ ప్రతాప్ సరోజ్, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ రిచా, సిస్టర్-మేట్రాన్ సుష్మా యాదవ్ ఉన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ కుమార్ ఘోష్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల చీఫ్ మెడికల్ ఆఫీసర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు

ప ర ణ ల క ప డ చ ట ప శవ క న ద 35 స కన లల 10 స ర ల క ల త తన న ల ర య బర ల ఆస పత ర ల ద ర ణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in