
Sanjay Raut Warns ; శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీలో మరోసారి చీలిక రాబోతోందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న ఊహాగానాలపై ఆ పార్టీ వర్కింగ్ లీడర్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారుదామని చూస్తున్న అసమ్మతి నేతలకు ఆయన నేరుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ధైర్యముంటే ముందుగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఆ తర్వాతే పార్టీని వీడాలని స్పష్టం చేశారు. ఈ రకమైన వెన్నుపోటు రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం సహించరని ఆయన హెచ్చరించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్టీ అగ్రనేతలు, ఎంపీలైన అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావు వాజేలతో కలిసి సంజయ్ రౌత్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తిందంటూ వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీ గుర్తుపై గెలిచి, ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం గోడ దూకాలని చూసే వారిని తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. Read Also: Environment : పర్యావరణం నాశనం కావడానికి మగాళ్లే కారణం – బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు “ప్రస్తుతం చట్టసభల్లో ఉన్న శివసేన (యూబీటీ) ఎంపీల విజయం వెనుక పార్టీ నాయకత్వ శ్రమ ఎంతో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మేమంతా రక్తం, చెమట చిందించి, రాత్రింబగళ్లు కష్టపడి, నిధులు ఖర్చు చేసి వీరిని ఎన్నికల్లో గెలిపించాం. ఇంత చేసినా పార్టీ మారుతామనే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ విశ్వాసఘాతకానికి పాల్పడితే మహారాష్ట్ర జనం ఈసారి వీధుల్లోకి వచ్చి బుద్ధి చెప్పడం ఖాయం” అని రౌత్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. flight ticket: తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే