ప్రముఖ పర్యావరణవేత్త
Actor ProfilePolitician

ప్రముఖ పర్యావరణవేత్త

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రముఖ పర్యావరణవేత్త, 'సుకుకి ఎక్స్ నోరా' వ్యవస్థాపకుడు మేజర్ శివకిరణ్ కన్నుమూత.. 61 ఏళ్ల వయసులోనే
Samayam Telugu26 Jul 2026
ప్రముఖ పర్యావరణవేత్త, 'సుకుకి ఎక్స్ నోరా' వ్యవస్థాపకుడు మేజర్ శివకిరణ్ కన్నుమూత.. 61 ఏళ్ల వయసులోనే

Major Shiva Kiran Obituary : హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడంలో, నగర పౌర వసతుల మెరుగుదలకు నిరంతరం శ్రమించిన విశ్రాంత ఆర్మీ అధికారి, ప్రముఖ పర్యావరణవేత్త మేజర్ శివకిరణ్ 61 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 10.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పర్యావరణ ప్రేమికులు, నగర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.అనారోగ్యంతో పోరాడుతూ..పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేజర్ శివకిరణ్ క్లోమానికి సంబంధించిన నొప్పితో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఆయనకు క్లోమ గ్రంథి కణితి ఆపరేషన్ జరిగింది. ఒకే సమస్యపై వరుసగా రెండు సార్లు శస్త్రచికిత్సలు జరగడంతో ఆయన శరీరం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. వైద్యులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బేగంపేటలోని కుందన్‌బాగ్ నివాసి అయిన మేజర్ శివకిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.'సుకుకి ఎక్స్ నోరా' ప్రస్థానందేశ రక్షణలో ఆర్మీ అధికారిగా సేవలు అందించిన శివకిరణ్.. రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ నగర పర్యావరణ పరిరక్షణను తన జీవిత ఆశయంగా మార్చుకున్నారు. గత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎమ్‌సీహెచ్) కాలంలోనే నగరంలో పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా తొలగించేందుకు ఆయన 'సుకుకి ఎక్స్ నోరా' అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. కేవలం చెత్తను ఎత్తడమే కాకుండా, సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న చెత్త ఏరుకునే వారి సంక్షేమం కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. నగరవ్యాప్తంగా దాదాపు 50 వికేంద్రీకృత జీరో వేస్ట్ ప్రాజెక్టులను విజయవంతంగా నెలకొల్పారు.జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా స్వచ్ఛ ఆటో నెట్‌వర్క్..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎమ్‌సీ) పరిధిలో నేడు మనం చూస్తున్న 'స్వచ్ఛ ఆటో ట్రాలీ'ల వ్యవస్థ వెనుక మేజర్ శివకిరణ్ ఆలోచన, కృషి ఎంతో

ప రమ ఖ పర య వరణవ త త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in