ప్రభాస్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన సమంత
Actor ProfileActor

ప్రభాస్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Total News1
Movie Updates0
Sources1
ప్రభాస్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన సమంత
Zee Telugu15 Jun 2026
ప్రభాస్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha:ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న పేరు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. వరుస భారీ ప్రాజెక్ట్‌లతో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు ఐదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత కూడా తన ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించడం విశేషం. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.సినిమా విడుదల సమయం దగ్గరపడటంతో సమంత వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ప్రశ్న ఎదురైంది. యాంకర్ మాట్లాడుతూ, “మీరు దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. కానీ ప్రభాస్‌తో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. ప్రభాస్‌తో సినిమా ఎప్పుడు ఉంటుంది?” అని అడిగారు. దీనికి సమంత నవ్వుతూ, “అది నేను ఎలా చెప్పగలను?” అని సమాధానం ఇచ్చింది. అప్పుడే పక్కనే ఉన్న దర్శకురాలు నందిని రెడ్డి స్పందించింది. “అది సమంతకు ఎలా తెలుస్తుంది? మంచి కథ, మంచి పాత్ర వస్తే తప్పకుండా ప్రభాస్‌తో సినిమా చేస్తుంది కదా” అని చెప్పింది. దీనికి సమంత కూడా అంగీకరిస్తూ నవ్వింది. సమంత సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్, సమంత ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే అది ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అలాంటి సినిమా