ప్రభుత్వ సేవలు సులభతరం.. ఫిర్యాదులకు 'మనమిత్ర
Actor ProfilePolitician

ప్రభుత్వ సేవలు సులభతరం.. ఫిర్యాదులకు 'మనమిత్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభుత్వ సేవలు సులభతరం.. ఫిర్యాదులకు 'మనమిత్ర
AP7AM14 Aug 2026
ప్రభుత్వ సేవలు సులభతరం.. ఫిర్యాదులకు 'మనమిత్ర

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పరిపాలనలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, ప్రక్రియలను సులభతరం చేయాలని ఆయన స్పష్టం చేశారు. నేడు అమరావతి సచివాలయంలోని రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో నిత్యం సంబంధాలుండే శాఖల్లో సేవల సరళీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు.ముందుగా 11 రకాల కీలక సేవల్లో అనవసరమైన ప్రక్రియలను కుదించి, వాటిని సులభతరం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను (పీజీఆర్ఎస్) మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను సులభంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేలా ఆన్‌లైన్ పోర్టల్‌తో పాటు, ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా ప్రత్యేక సేవలను ప్రారంభించాలని సూచించారు. కేవలం టెక్స్ట్ మెసేజ్‌లే కాకుండా, వాయిస్ మెసేజ్‌ల రూపంలో పంపే ఫిర్యాదులను కూడా స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయికి అధికారులు.. కనెక్టివిటీకి డెడ్‌లైన్ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా సెక్రటరీలు నెలకు 3 రోజులు, శాఖాధిపతులు (హెచ్‌ఓడీలు) 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేస్తూ సర్క్యులర్ జారీ చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను

ప రభ త వ స వల స లభతర ఫ ర య ద లక మనమ త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in