ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి
Actor ProfilePolitician

ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి
Namasthe Telangana19 Jun 2026
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి

హనుమకొండ చౌరస్తా, జూన్‌ 19: ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కార్యవర్గం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు హనుమకొండ లష్కర్‌ బజార్‌లోని ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ గర్ల్స్‍ హై స్కూల్‌, ప్రాక్టీస్ హై స్కూల్లో సర్వే నిర్వహించారు. ఈ స్కూళ్లలో కొన్ని స్కూళ్లలో చదువు చెప్పడానికి టీచర్స్‍ కోరుతూ ఉందని మర్కజీ హైస్కూల్లో హిందీ బోధించడానికి టీచర్స్‍కొరత ఉందని గేమ్స్‍ ఆడిపించడానికి స్కూల్‌ మొత్తంలో ఒక్కరే పీఈటీ ఉన్నారని మరొకరి అవసరం ఉందని అలాగే టాయిలెట్‌ సరిపోను లేవని ప్రాక్టీసింగ్‌ హైస్కూల్లో పర్మినెంట్‌ టీచర్స్‍ లేరని డిప్యూటేషన్‌ మీద వచ్చిన వారే ఉన్నారన్నారు. బాయ్స్‍కి మొత్తానికి టాయిలెట్స్‍ లేవని ఉన్న స్కూళ్లలో క్లీన్‌ చేయడానికి స్కావెంజర్స్‍ లేరని గర్ల్స్‍ హైస్కూల్లో వాన పడినప్పుడు గ్రౌండ్‌లో నీళ్ళు ఆగుతున్నాయని క్లాస్రూంలోకి నడవడానికి కూడా ఇబ్బంది అవుతుందని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్కూల్‌ సమీపంలోనే ప్రైవేట్‌ పాఠశాలలు నెలకొన్నాయని వెంటనే డీఈఓ, కలెక్టర్‌ స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్‌ కార్యవర్గ సభ్యులు వంగవీటి మోహన్‌, జిల్లా నాయకులు రమణ, విశ్వతేజ్‌ పాల్గొన్నారు