ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ
Actor ProfilePolitician

ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ
Sakshi25 Aug 2026
ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ

హైదరాబాద్ నుంచే ప్రపంచ విమానయాన భవిష్యత్‌కు దిశానిర్దేశం గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల పనులు త్వరలో ప్రారంభం... కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో గ్రీన్ సిగ్నల్ 'మేడ్ ఇన్ తెలంగాణ' ఇప్పుడు ప్రపంచ అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఎగురుతోంది మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్: ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలవబోతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన ఏరోమార్ట్ హైదరాబాద్–2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ & డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, "ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా" అని స్పష్టం చేశారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు ప్రత్యక్ష అనుభవం ఉందన్నారు. "ఒక్క చిన్న విడిభాగం లోపం కూడా మిషన్ విజయాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయి" అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ఎఫ్–16 యుద్ధ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు, ఎంఆర్ఓ వ్యవస్థలు నేడు తెలంగాణలోనే తయారవుతున్నాయని మంత్రి తెలిపారు. "'మేడ్ ఇన్ తెలంగాణ' అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతోంది" అని పేర్కొన్నారు. స్పెయిన్‌కు చెందిన ITP Aero, కెనడాకు చెందిన FTG Aerospace వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక

ప రప చ ఏర స ప స ర జధ న గ త ల గ ణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in