ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
Actor ProfilePolitician

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
Oneindia Telugu8 Aug 2026
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ గ్రీన్ గ్రోత్, సుస్థిర అభివృద్ధిలో మోదీ నాయకత్వానికి గుర్తింపునకు గానూ ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ అందజేశారు. ఇక ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని అందజేసినందుకు గానూ సీషెల్స్ ప్రజలు, ప్రభుత్వానికి, ఆ దేశ అధ్యక్షుడు హెర్మినీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ టైటిల్ ను నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను. ఈ టైటిల్ ను క్లైమేట్ ఛేంజ్ కోసం పోరాడుతున్న అనేక దేశాలకు అంకితం చేస్తున్నాను. వాతావరణ మార్పును మనం తక్షణమే అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు అన్ని దేశాలు ముందుకు రావాలి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేసినందుకు గానూ ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ఈ ఏడాది మే నెలలోనే మోదీకి ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ ను అందించిన విషయం తెలిసిందే. అంతకుముందు సియోల్ శాంతి బహుమతి, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డులు ప్రధాని మోదీకి దక్కాయి.ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 27న సీషెల్స్‌ దేశ పర్యటనకు వెళ్లారు. 2015 తర్వాత ఈ దేశానికి ప్రధాని మోదీ వెళ్లడం ఇది రెండోసారి. ఈ దేశంలో మోదీ పర్యటన జూన్ 29 వరకూ జరుగుతుంది. సీషెల్స్ నేషనల్ డే గోల్డెన్ జూబ్లీలో గెస్ట్ ఆఫ్ ఆనర్‌ గా మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు విక్టోరియా ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
Sakshi8 Aug 2026
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

విక్టోరియా: సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ అనుకూల వృద్ధి (గ్రీన్ గ్రోత్), సముద్ర వనరుల బాధ్యతాయుత నిర్వహణలో ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ సెషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ అవార్డును ప్రధానికి ప్రదానం చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రెసిడెన్షియల్ సైటేషన్‌లో ప్రధాని మోదీ సుస్థిర ఆర్థిక వృద్ధి, బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ) పట్ల చూపిన నిబద్ధతను సెషెల్స్ ప్రభుత్వం కొనియాడింది. ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలకు భారత్ అందిస్తున్న మద్దతును, వాతావరణ ప్రతిఘటన శక్తిని పెంపొందించడంలో, అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడంలో మోదీ పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ పురస్కారం భారత్-సెషెల్స్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని సెషెల్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తనకు లభించిన ఈ ప్రతిష్టాత్మక గౌరవంపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. సెషెల్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడంపై గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను తమ భవిష్యత్ తరాల పట్ల బాధ్యతగా భావిస్తున్న ప్రపంచంలోని అన్ని దేశాలకు దీనిని అంకితం చేస్తున్నాను’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పర్యావరణం, వ్యవసాయ రంగాలలో ప్రధాని మోదీ అంతర్జాతీయంగా అందుకున్న అవార్డుల పరంపరలో ఇది తాజా చేరింది. కాగా, ఈ ఏడాది మేలో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధానికి ‘అగ్రికోలా మెడల్’ అందజేసింది. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, ఆధునిక వ్యవసాయ మార్పులు తీసుకురావడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు) చీరలో సింగారించుకుని అందంగా

ప రధ న మ ద క మర అ తర జ త య గ రవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in