
సున్నితమైన హాస్యంతో సమాజాన్ని నవ్వించిన విజ్ఞాన వీచికగా, చిరునవ్వుల వెనుక భావోద్వేగాల లోతును చూపిన దర్శకుడిగా, ప్రతి గుండెను సున్నితంగా స్పృశించిన రచయితగా కె.భాగ్యరాజ్‌ను కీర్తిస్తారు సినీ ప్రేక్షకులు. సున్నితమైన హాస్యంతో సమాజాన్ని నవ్వించిన విజ్ఞాన వీచికగా, చిరునవ్వుల వెనుక భావోద్వేగాల లోతును చూపిన దర్శకుడిగా, ప్రతి గుండెను సున్నితంగా స్పృశించిన రచయితగా కె.భాగ్యరాజ్‌ను (K Bhagya Raj) కీర్తిస్తారు సినీ ప్రేక్షకులు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్క్రీన్ ప్లే ల్యాబ్‌గా పేరొందిన కె.భాగ్యరాజ్ ఆకస్మిక మరణం సినిమా రంగానికి తీరని లోటుగా సినీ ప్రముఖులు కొనియాడారు. శనివారం ఉదయం భాగ్యరాజ్ గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దర్శకుడు జి.రామకృష్ణన్, భారతీరాజా చిత్రాలకు సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. తదుపరి భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశారు. కెరీర్ బిగినింగ్‌లోనే ఆయన దగ్గర దర్శకత్వంలోని మెళకువలు, స్క్రీన్ ప్లే టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఆయన రాసిన ఎన్నో కథలు, హిందీ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించాయి. అంతేకాదు ఎన్నో చిత్రాలు రీమేక్ కూడా అయ్యాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్ నటించిన ‘వో 7 దిన్’ చిత్రానికి కూడా కథ ఆయనే అందించారు. ‘మూడు ముళ్ళ బంధం’ చిత్రంతోనే వెండితెరకు సరికొత్త ను అలవాటు చేశారు. మధ్యతరగతి కుటుంబాల కథలకు సున్నితమైన హాస్యాన్ని జోడించి వెండితెరపై సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. సామాన్య సినీ ప్రేక్షకుల నాడిని పట్టి ఆ తరహా చిత్రాలనే ఎక్కువగా తీశారు. నటుడిగానూ, దర్శకుడిగానూ, స్క్రీన్ ప్లే రైటర్‌గా తనదైన ముద్ర వేశారు. ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని భాగ్యరాజ్‌ను పిలుస్తారు. చిరునవ్వుల వెనుక భావోద్వేగాల లోతును చూపిన దర్శకుడిగా, ప్రతి గుండెను సున్నితంగా స్పృశించిన రచయితగా కె.భాగ్యరాజ్‌ను కీర్తిస్తారు. 1983లో వచ్చిన ‘ముందనై ముడిచ్చు’ (మూడు ముళ్లు)