పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక సంస్థ అకాల్ తఖ్త్ భారీ షాకిచ్చింది. ఆయనను ‘గురు ద్రోహి’గా ప్రకటిస్తూ.. సిక్కు సమాజం మాన్‌తో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని పిలుపునిచ్చింది. అకాల్ తఖ్త్ అనేది సిక్కుల అత్యున్నత మత సంస్థ. సిక్కు భక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నోటీసులు జారీచేయడంతో గత జనవరి 15న పంజాబ్ ముఖ్యమంత్రి అకాల్ తఖ్త్ ఎదుట హాజరయ్యారు. ఈ సమయంలో సిక్కు గురువులపై భగవంత్ మాన్ మద్యం చల్లుతున్నట్టు ఓ వీడియోపై కూడా మత పెద్దలు ప్రశ్నించారు. అయితే, అది ఏఐ వీడియో అని తోసిపుచ్చారు. కానీ, సోమవారం వచ్చిన ఫోరెన్సిక్ నివేదికలో అది అసలైన వీడియో అని వెల్లడయ్యింది. ఆ వీడియోలోని వ్యక్తి నిజంగా ముఖ్యమంత్రే అని ఫోరెన్సిక్ నివేదిక చెప్పలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎదురు వాదన చేసింది. కానీ, ఐదుగురు సింగ్ సాహిబ్‌ల (ప్రధాన మతగురువుల) సమావేశం అనంతరం.. అకల్ తఖ్త్ జాతేదార్ కుల్దీప్ సింగ్ గర్గాజ్ తీర్పును ప్రకటించారు. ‘‘మేము ఆ వీడియో గురించి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే అది ఏఐతో రూపొందించిందని ఆయన సమాధానం ఇచ్చారు.. దీనికి రుజువు చూపమని ఆయన్ని కోరాం.. కానీ ఆరు నెలల పాటు ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత, భారత ప్రభుత్వం గుర్తించిన రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఆ వీడియోను పరీక్షించగా నకిలీది కాదని, ఏఐతో రూపొందించింది కూడా కాదని తేలింది. ఈరోజు, 'పంథ్' ఈ విషయంపై చర్య తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చింది’’ అని గర్గాజ్ అన్నారు.అకాల్ తఖ్త్ వద్ద మాన్ అబద్ధం చెప్పారని అందుకే ఆయనను గురువు దృష్టిలో దోషిగా లేదా 'గురు ద్రోహి'గా ప్రకటించారని జాతేదార్ అన్నారు. ‘‘సిక్కులకు ముఖ్యమంత్రిపై ఎలాంటి అంచనాలు లేవు, 'పంథ్', గురువు అనుచరులు ఆయనతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు’’ అని ఆయన తెలిపారు.వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్న
Actor ProfilePolitician
పంబాజ్ సీఎం భగవంత్ మాన్ కు భారీ షాక్.. గురు ద్రోహి’గా ప్రకటించిన అకాల్ తఖ్త్
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
పంబాజ్ సీఎం భగవంత్ మాన్ కు భారీ షాక్.. గురు ద్రోహి’గా ప్రకటించిన అకాల్ తఖ్త్