పాపికొండల యాత్ర నిలిపివేత
Actor ProfilePolitician

పాపికొండల యాత్ర నిలిపివేత

Total News1
Movie Updates0
Sources1
పాపికొండల యాత్ర నిలిపివేత
Vaartha14 Jun 2026
పాపికొండల యాత్ర నిలిపివేత

Papikondalu Boating : గోదావరి నది ఒడ్డున సాగే ఆహ్లాదకరమైన పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పర్యాటక బోట్ల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నందున నేటి నుంచి యాత్రను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీవో (RDO) స్వాతి అధికారికంగా ప్రకటించారు. ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (AP Tourism) కు చెందిన ఒక ప్రభుత్వ బోటుతో పాటు, ప్రైవేటు రంగానికి చెందిన మరో 15 పర్యాటక బోట్లు రేవులకే పరిమితం కానున్నాయి. గోదావరి అందాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా తరలివచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది. Read Also ; ఏపీలో రుతుపవనాల జోరు: పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ ఇటీవల కాలంలో పాపికొండల పర్యాటక బోట్లలో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, తృటిలో తప్పుతున్న ప్రమాదాలు పర్యాటకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే దేవీపట్నం సమీపంలో 89 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక బోటు హఠాత్తుగా ఇంజిన్ చెడిపోవడంతో గోదావరి నది నడిబొడ్డున నిలిచిపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోంది. బోట్ల నిర్వహణ, లైఫ్ జాకెట్ల లభ్యత, డ్రైవర్ల నైపుణ్యం మరియు అత్యవసర రక్షణ వ్యవస్థలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రతీ బోటును నిపుణుల కమిటీతో క్షుణ్ణంగా తనిఖీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ భద్రతా పరమైన తనిఖీలు పూర్తయి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు సాధించిన బోట్లను మాత్రమే తిరిగి నదిలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. Breakfast Scheme : రేపటి నుంచి ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ Chandrababu Naidu: గొలుసుకట్టు చెరువులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు గమనిక: ఈ

ప ప క డల య త ర న ల ప వ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in