పాన్ ఇండియా దర్శకులతో నవీన్ పోలిశెట్టి.. ఫ్రేమ్ అదిరిందిగా.. వీడియో వైరల్
Actor ProfileActor

పాన్ ఇండియా దర్శకులతో నవీన్ పోలిశెట్టి.. ఫ్రేమ్ అదిరిందిగా.. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాన్ ఇండియా దర్శకులతో నవీన్ పోలిశెట్టి.. ఫ్రేమ్ అదిరిందిగా.. వీడియో వైరల్
10TV Telugu20 Jul 2026
పాన్ ఇండియా దర్శకులతో నవీన్ పోలిశెట్టి.. ఫ్రేమ్ అదిరిందిగా.. వీడియో వైరల్

Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తక్కువ సినిమాలతోనే చాలా పాపులారిటీ, ఫేమ్ తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇటీవల సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో వచ్చి ఓ మోస్తరు విజయం సాధించాడు. తాజాగా నవీన్ పోలిశెట్టి పాన్ ఇండియా దర్శకులు లోకేష్ కనగరాజ్, రిషబ్ శెట్టి, సుకుమార్, ప్రశాంత్ నీల్, హరీష్ శంకర్, వీరితో పాటు మైత్రి నిర్మాత నవీన్ యెర్నేని వీరందరితో కలిసి ఉన్న వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఒక్కో దర్శకుడు సాధించిన హైయెస్ట్ కలెక్షన్స్ 500 కోట్లు, 800 కోట్లు, 2000 కోట్లు అని చెప్తూ పాన్ ఇండియా దర్శకులతో స్పెషల్ వీడియో షేర్ చేసాడు. లోకేష్ అల్లు అర్జున్ తో మీటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూట్ నిమిత్తం ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు. రిషబ్ శెట్టి జై హనుమాన్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నారు. ఇక సుకుమార్, హరీష్ శంకర్ ఇక్కడే ఉన్నారు. వీరంతా మైత్రి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన స్పెషల్ పార్టీలో పాల్గొనగా అక్కడికి నవీన్ పోలిశెట్టి కూడా రావడంతో ఇంతమంది పాన్ ఇండియా దర్శకులను చూసి స్పెషల్ వీడియో చేసాడు నవీన్. తన సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేయడంతో పాన్ ఇండియా దర్శకులతో నవీన్ పోలిశెట్టి ఫ్రేమ్ అదిరింది అంటూ వీడియోని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు

ప న ఇ డ య దర శక లత నవ న ప ల శ ట ట ఫ ర మ అద ర ద గ వ డ య వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in