
వరుస చిత్రాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఈసారి ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. ‘ఇరుముడి కట్టు శబరిమల ఎక్కు.’ అంటూ సాగే ఈ పాట అయ్యప్ప భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో ఉండే మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్స్‌కి భిన్నంగా, పూర్తిగా డివోషనల్ టచ్‍తో ఈ పాటను మలిచారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన స్వరాలు, ఆకట్టుకునే సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోశాయి. అయ్యప్ప భక్తులకు పూనకాలు తెప్పించేలా ‘ఇరుముడి కట్టు’ సాంగ్ రిలీజ్ చేశారు. స్పిరిచువల్ లుక్‌లో రవితేజ అయ్యప్ప మాల ధరించి, నల్లటి దుస్తుల్లో రవితేజ మునుపెన్నడూ లేని విధంగా ఒక డివైన్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ భక్తులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. శబరిమల యాత్ర విశేషాలు, సాంప్రదాయ నృత్యాలు, ప్రియా భవానీ శంకర్ హోమ్లీ లుక్స్ ఈ సాంగ్ విజువల్స్ ని మరింత అందంగా మార్చాయి. శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్, రవితేజ నటన కలగలిసిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇరుముడి సినిమా ప్రాజెక్టు పట్టాలెక్కినప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శబరిమల సీజన్ కాకపోయినా, ఈ పాట వింటుంటే అయ్యప్ప భక్తులకు ఇప్పుడే మాల వేసినంత భక్తిభావం కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు