పెద్ద హోటల్స్ లో చెఫ్ లు కూడా మగవాళ్లే
Actor ProfileActor

పెద్ద హోటల్స్ లో చెఫ్ లు కూడా మగవాళ్లే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ద హోటల్స్ లో చెఫ్ లు కూడా మగవాళ్లే
Eenadu25 Jul 2026
పెద్ద హోటల్స్ లో చెఫ్ లు కూడా మగవాళ్లే

ఇంటర్నెట్‌ డెస్క్: పుణె బిజినెస్‌మ్యాన్‌ కేతన్ అగర్వాల్‌ మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి ఘటనలపై సినిమా తీయాలని ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ను (Rahul Ravindran) ఓ నెటిజన్‌ కోరారు. ఇదే అంశంపై మరో నెటిజన్‌కు చిన్మయి ఇచ్చిన కౌంటర్‌ వైరల్‌ అవుతోంది. ‘‘మన సొసైటీలో శతాబ్దాలుగా మహిళలను కుంగదీసే ఒక వ్యవస్థ నడుస్తోంది. నా చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు నిశ్శబ్దంగా బాధపడటం నేను చూశాను. అలాంటి ఓ కథనే ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’లో చూపించాను. ఒకవేళ నాకు ఆసక్తికరంగా అనిపించే కథ ఏదైనా దొరికితే, భవిష్యత్తులో ఒక మహిళ చేసిన నేరం గురించి సినిమా తీస్తానేమో. కానీ, పురుషులపై మహిళలు చేసే నేరాలంటూ జనరలైజ్ చేసి తీయను. నా దృష్టిలో ఆ రెండింటికీ చాలా తేడా ఉంది’’ అని రాహుల్‌ తెలిపారు. దీనిపై ఆయన భార్య చిన్మయి స్పందిస్తూ.. రాహుల్ అందరిలా ఆలోచించరని అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. ఈ పోస్ట్‌కు ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా పెట్టిన కామెంట్‌పై ఆమె మండిపడ్డారు. ‘అందరికీ వంట చేసే వాళ్లు దొరకరు’ అని పెట్టిన కామెంట్‌కు చిన్మయి స్పందిస్తూ.. ఇంట్లో అమ్మ చేసే వంటను కొందరు చులకనగా చూస్తూ, అవమానకరంగా మాట్లాడే వారు ఉన్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద హోటల్స్‌లో చెఫ్‌లు కూడా మగవారేనని అన్నారు. వంటను కేవలం మహిళలకే పరిమితం చేయొద్దన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ప ద ద హ టల స ల చ ఫ ల క డ మగవ ళ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in