పెద్ది' సినిమా బ్లాక్ బస్టర్.. అనాథ పిల్లలకు ఊహించని గిఫ్ట్స్ ఇచ్చిన రామ్ చరణ్.. ఎమోషనల్ వీడియో
Actor ProfileActor

పెద్ది' సినిమా బ్లాక్ బస్టర్.. అనాథ పిల్లలకు ఊహించని గిఫ్ట్స్ ఇచ్చిన రామ్ చరణ్.. ఎమోషనల్ వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ది' సినిమా బ్లాక్ బస్టర్.. అనాథ పిల్లలకు ఊహించని గిఫ్ట్స్ ఇచ్చిన రామ్ చరణ్.. ఎమోషనల్ వీడియో
TV9 Telugu10 Jul 2026
పెద్ది' సినిమా బ్లాక్ బస్టర్.. అనాథ పిల్లలకు ఊహించని గిఫ్ట్స్ ఇచ్చిన రామ్ చరణ్.. ఎమోషనల్ వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. జూన్ 04న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా రామ్ చరణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం మంగళవారం (జూన్ 23) పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ పేరుతో సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరో రామ్ చరణ్, డైరెక్టర్లు సుకుమార్, అనిల్ రావిపూడితో పాటు పెద్ది చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరైంది. ఇదిలా ఉంటే పెద్ది చిత్ర బృందం ఒక మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటోంది. అదేంటంటే... ఈ సినిమా చిత్ర బృందం అనాథ ఆశ్రమాలలోని పిల్లలకు మర్చిపోలేని గిఫ్ట్స్ ఇచ్చింది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ వాడిన ఒరిజినల్ బ్యాట్‌ను పోలిన ప్రత్యేకమైన రెప్లికాలను యూనిట్ తయారు చేయించింది. మరీ ముఖ్యంగా, ఈ బ్యాట్లపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా సంతకాలు చేయడం విశేషం. రామ్ చరణ్ సంతకం చేసిన ఈ క్రికెట్ బ్యాట్లను అనాథశ్రమాల్లోని పిల్లలకు పంపిణీ చేసింది 'పెద్ది' టీమ్. దీంతో రామ్ చరణ్ సంతకం ఉన్న ఆ బ్యాట్లను చూసి ఆ చిన్నారులు తెగ మురిసిపోయారు. ఈ క్రికెట్ బ్యాట్లను ‘పెద్ది’ సినిమా కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేశారు. కేవలం సినిమా కోసమే కాకుండా.. అనాథ పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనే యూనిట్ రిక్వెస్ట్ మేరకు, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరిన్ని బ్యాట్లను సిద్ధం చేశారు. ఇప్పుడు వాటిని అనాథశ్రమాల్లోని పిల్లకు పంచి వారి కళ్లల్లో ఆనందం నింపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా

ప ద ద స న మ బ ల క బస టర అన థ ప ల లలక ఊహ చన గ ఫ ట స ఇచ చ న ర మ చరణ ఎమ షనల వ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in