పెద్ది సక్సెస్ అయినా.. రామ్ చరణ్ లో ఏదో అసంతృప్తి
Actor ProfileCelebrity

పెద్ది సక్సెస్ అయినా.. రామ్ చరణ్ లో ఏదో అసంతృప్తి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ది సక్సెస్ అయినా.. రామ్ చరణ్ లో ఏదో అసంతృప్తి
Zee Telugu28 Jun 2026
పెద్ది సక్సెస్ అయినా.. రామ్ చరణ్ లో ఏదో అసంతృప్తి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Ram Charan Not Satisfied: వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్టుగా ఉంది రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా పరిస్థితి. ఆర్ఆర్ఆర్ తర్వాత ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. అంతేకాదు చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమాలు రాడ్ రంబోలా మాదిరిగా స్పీడ్ బ్రేకర్స్‌గా మారాయి. కానీ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేసిన ‘పెద్ది’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో మంచి వసూళ్లనే సాధించింది. కానీ కోర్ ప్యాన్ ఇండియా మార్కెట్ అయినా.. హిందీలో ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తమిళం, మలయాళంలో పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు.. అక్కడ కనీస వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక తమిళం, మలయాళంలో అయితే.. పోస్టర్ అదేనండి పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. మొత్తంగా కర్ణాటక ఏరియాలో శివరాజ్ కుమార్ ఇంపాక్ట్ వలన అంతో ఇంతో చిల్లర రాలింది. అక్కడ కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ వసూళ్లు దక్కాయి. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లో మినిమం $5 మిలియన్ టార్గెట్ చేసి బరిలో దిగిన ‘పెద్ది’ సినిమా $3.5 మిలియన్ డాలర్స్ దగ్గరే ఆగిపోయింది. ‘పెద్ది’ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే డీసెంట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన వేరే భాషల్లో ‘పెద్ది’ బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో ఈ సినిమా హిట్టైయినా.. వేరే భాషల్లో పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడంతో ఈ సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఆగిపోయింది