పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదిక
Actor ProfileActor

పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదిక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదికపై బుచ్చిబాబు
AP7AM9 Jul 2026
పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదికపై బుచ్చిబాబు

"ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పిఠాపురం నుంచి ఉత్తరాలు రాసేవాడిని. నా ఉత్తరాలు ఆయన దగ్గరికి చేరాయో లేదో తెలియదు కానీ, నా కథ ఆయన ఇంటికి చేరింది," అంటూ 'పెద్ది' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విజయవంతమైన సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్' లో ఆయన మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. తన ప్రసంగంలో కథానాయకుడు రామ్ చరణ్‌పై, తన గురువు సుకుమార్‌పై, మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.రామ్ చరణ్ అంకితభావం గురించి బుచ్చిబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. "చరణ్ గారు ఒక స్టార్ హీరో, నటుడు. ఆయనతో రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయడం చాలా సులభం. కానీ 'పెద్ది' లాంటి కథను నమ్మారు. సెట్‌కు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ స్టార్‌లా కారు దిగారేమో గానీ, సెట్‌లోకి అడుగుపెట్టేటప్పుడు మాత్రం 'పెద్ది' పాత్రధారిగానే నడిచి వచ్చారు. నేను రాసుకున్న పాత్రకు ఆయన తన నటనతో పది రెట్లు ప్రాణం పోశారు. నేను రాసుకున్న కథను, పెద్ది క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్లేలా చేశారు. ఈ విషయంలో చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను" అని ఉద్వేగంగా తెలిపారు.తన బాల్యం నాటి అభిమానాన్ని గుర్తుచేసుకుంటూ, "చిరంజీవి గారికి ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ ఆయన ఇంటి అడ్రస్‌కు లెటర్లు రాసేవాడిని. ఇప్పుడు నా మొదటి కథ, రెండో కథ 'పెద్ది' కూడా ఆయన ఇంటికే చేరడం నా

ప ద ద మ గ బ ల క బస టర వ ద క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in