పెద్ద' ద్ది చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
Actor ProfileActor

పెద్ద' ద్ది చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే

Total News1
Movie Updates0
Sources1
పెద్ద' ద్ది చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema15 Jun 2026
పెద్ద' ద్ది చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఇటీవల ధురంధర్ 2 (Dhurandhar 2) హిందీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా అమెరికా (North America)లో 28.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ఇండియన్ సినిమాగా అవతరించింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైంది. ఇక ఈ సినిమా మొదటి భాగం “ధురంధర్” గత ఏడాది డిసెంబర్ లో విడుదలై నార్త్ అమెరికాలో 20.5 మిలియన్ల సంపాదించింది. అంటే రెండు భాగాలు కలిపి ఉత్తర అమెరికాలో దాదాపు 50 మిలియన్ డాలర్లు (అక్షరాలా 490 కోట్ల రూపాయలు) ఒక్క అమెరికాలోనే కొల్లగొట్టాయి. ఈ రెండు సినిమాలు గత ఏడు, ఎనిమిది నెలల్లోనే విడుదలై ఇంత మొత్తం సంపాదించాయి. అంటే అమెరికాలో భారతీయ సినిమాల మార్కెట్ మామూలుగా లేదు. ఈ సినిమాలకు సగటు టికెట్ ధర 10 నుంచి 12 డాలర్లు మాత్రమే. కానీ తెలుగు సినిమాలకు మాత్రం సగటు టికెట్ ధర 18 నుంచి 30 డాలర్ల వరకు ఉంటోంది. అందుకే, తెలుగు సినిమాల మార్కెట్ అమెరికాలో ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు భారీ షాకులు తగిలాయి డిస్ట్రిబ్యూటర్లకు. ఒక దాన్ని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ నటించిన “పెద్ది” (Peddi) సినిమా ఇప్పటివరకు 3.3 మిలియన్ డాలర్లు మాత్రమే సంపాదించింది. 3.5 మిలియన్ డాలర్ల రేంజ్ లో ఈ సినిమా రన్ ముగిసిపోతుంది. అంటే ఇంకా పెద్దగా వచ్చేది లేదు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ భారీ మొత్తానికి కొన్నారు. 6 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధిస్తేనే లాభం, నష్టం లేని (బ్రేక్ ఈవెన్ పాయింట్) స్థితికి చేరుకుంటారు డిస్ట్రిబ్యూటర్. అంటే “పెద్ది” వల్ల డిస్ట్రిబ్యూటర్ కి 3 మిలియన్ డాలర్లు (29 కోట్ల రూపాయలు) హాంఫట్. ధురంధర్ లాంటి సినిమాలు 20 మిలియన్ డాలర్లపైనే సులువుగా సంపాదిస్తున్నప్పుడు మన సోకాల్డ్