
నటి దియా మీర్జా (Dia Mirza) ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి. పితృస్వామ్యం (patriarchy) వల్లే పర్యావరణ సంక్షోభం (climate crisis) అని ఆమె పేర్కొంది. మగవాళ్ల వల్లే మొత్తం వాతావరణం


నటి దియా మీర్జా (Dia Mirza) ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి. పితృస్వామ్యం (patriarchy) వల్లే పర్యావరణ సంక్షోభం (climate crisis) అని ఆమె పేర్కొంది. మగవాళ్ల వల్లే మొత్తం వాతావరణం

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) వాతావరణ సంక్షోభంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పితృస్వామ్యానికి, వాతావరణ మార్పులకు సంబంధం ఉందని తాను చేసిన వ్యాఖ్యలను దియా మీర్జా సమర్థించుకున్నారు. ఇటీవల సోహా అలీఖాన్ ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్‌కాస్ట్‌లో దియా మాట్లాడారు. ఫొటోగ్రాఫర్ ఆరతికుమార్ రావుతో కలిసి ఎకోఫెమినిజంపై ఆమె చర్చించారు. ‘వాతావరణ మార్పు కేవలం పర్యావరణ సమస్య కాదు. ఇది అసమానతల సమస్య కూడా. ఏళ్లుగా పురుషాధిక్య వ్యవస్థలు ప్రకృతిని దోచుకున్నాయి. శతాబ్దాలుగా, పితృస్వామ్య వ్యవస్థలు అధికారాన్ని చేపట్టాయి. సంరక్షణ కంటే దోపిడీకే ప్రాధాన్యమిచ్చి, ప్రకృతిని, బలహీన వర్గాలను దోపిడీకి గురయ్యే వనరులుగా చూశాయి. ఇది పితృస్వామ్య సమాజంలో మహిళలు, బాలికలను చూసే విధానం లాంటిదే’ అని ఆమె అన్నారు. ‘స్త్రీలను చూసినట్లే అడవులు, నదులను వస్తువుల్లా చూశాయి. వరదలు, కరవు వస్తే మొదట ఇబ్బందిపడేది ఆడవాళ్లు, పిల్లలే. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో వారికి చోటు లేదు. ఆధిపత్యం పోయి, కరుణ, సమానత్వం ఉంటేనే పరిష్కారం దొరుకుతుంది’ అని ఆమె తేల్చి చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు