పుణె లోహగడ్ కోట హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Actor ProfilePolitician

పుణె లోహగడ్ కోట హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పుణె లోహగడ్ కోట హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Andhra Jyothy2 Aug 2026
పుణె లోహగడ్ కోట హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పుణె లోహగడ్ కోట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే అంశంపై పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా వారికి సంచలన విషయాలు తెలిశాయి. మహారాష్ట్ర: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె లోహగడ్ కోట హత్య కేసులో తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ చౌధరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో విచారణకు హాజరైన సియా సోదరుడు సాహిల్ గోయల్, కుటుంబ సభ్యుల వాంగ్మూలం దర్యాప్తులో కీలకంగా మారింది. తన క్రికెట్ మ్యాచ్‌లకు సియా తరచుగా హాజరయ్యేదని, ఆ సమయంలోనే చేతన్ చౌధరితో ఆమెకు పరిచయం ఏర్పడిందని పోలీసులకు సాహిల్ తెలిపాడు. అనంతరం గతేడాది దీపావళి సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో వాళ్లిద్దరూ మళ్లీ కలుసుకున్నారని, అప్పటి నుంచి మరింత సన్నిహితంగా మెలిగారని విచారణలో వెల్లడించాడు. సియాకు పెళ్లి విషయంలో అభ్యంతరం ఉంటే తమ కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసేవారని పోలీసులకు సాహిల్ తెలిపాడు. మరోవైపు సియా తల్లి పూజా గోయల్ మాత్రం తమ కుమార్తె ఎప్పుడూ పెళ్లిపై అసంతృప్తి వ్యక్తం చేయలేదని వెల్లడించింది. చేతన్ చౌధరిని తాను ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపింది. అయితే, సియా తరఫు న్యాయవాది మాత్రం చేతన్ ఆమెకు కేవలం స్నేహితుడేనని పేర్కొన్నారు. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన సియా గోయల్, చేతన్ చౌధరి కాల్ డీటెయిల్స్ సంచలనం రేపుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి వారిద్దరి మధ్య ఏకంగా 2 వేలకుపైగా ఫోన్ కాల్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు వాళ్లిద్దరూ 238 గంటలకు పైగా మాట్లాడుకున్నట్లు వెల్లడైంది. దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది

ప ణ ల హగడ క ట హత య క స ల వ ల గ ల క స చలన వ షయ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in