
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Police Recreate crime scene with siya goyal and Chetan Chaudhary: పూణె బిజినెస్ మెన్ కేతన్ అగర్వాల్ హత్య ఘటన యావత్ దేశాన్ని షాకింగ్ కు గురిచేసేదిగా మారింది. ఈ ఘటనతో చాలా మంది యువతీ, యువకుల అసలు పెళ్లంటేనే భయంతో జడుసుకునే సిట్యువేషన్ ఎదురైంది. మరోవైపు కేతన్ అగర్వాల్ ఘటనపై మహా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు కూడా దర్యాప్తు స్పీడ్ ను పెంచారు. ఇప్పటికే సియా సోదరుడు,తల్లిదండ్రుల్ని కూడా విచారించారు. వీరి విచారణలో షాకింగ్ నిజాలు బైటపడ్డాయి. మరోవైపు సియా, చేతన్ లు సైతం నేరాన్ని ఒకరిపై మరోకరు నెట్టుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఈ ఘటనలో పోలీసులు డిజిటల్ ఎవిడెన్స్ ను రాబట్టడంపై చర్యలు వేగవంతం చేశారు. ఇద్దరి ఫోన్ లను ఫోరెన్సెక్ టెస్ట్ ల కోసం పంపించారు. తాజాగా.. సియాను, చేతన్ ను పోలీసులు పూణె లోని లోహగఢ్ కోటలో ఎక్కడైతే చేతన్ ను లోయలోకి నెట్టి చంపారో అక్కడకు పోలీసులు తీసుకొని వచ్చారు. సీన్ రీక్రియేషన్ లో భాగంగా పోలీసులు ఆదివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఇద్దర్ని కళ్లకు గంతలు కట్టి తీసుకొచ్చారు. హత్య జరిగిన రోజు కేతన్ ఎప్పుడు అక్కడికి వచ్చాడు..?.. చేతన్ ఎప్పుడు ప్రమాద స్పాట్ లో ఉన్నాడు..? నిందితుల కదలికలు ఎలా ఉన్నాయి..? వంటి అనేక ప్రశ్నల్ని పోలీసులు ఇద్దర్ని వేర్వేరుగా కోట పైన నిలబెట్టి మరీవిచారించారు. అంతే కాకుండా కేతన్ కు