
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ - జూలూరుపాడు కేజీబీవీ, జడ్పీ పాఠశాలల ఆకస్మిక తనిఖీ జూలూరుపాడు, జూన్ 30 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం అత్యంత ముఖ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ సందర్శించిన కలెక్టర్ కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను నిశితంగా పరిశీలించారు. ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ విద్యాసంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినుల ఔటింగ్ రిజిస్టర్‌ను పరిశీలించిన ఆయన, బాలికల భద్రత విషయంలో రాజీ పడకూడదని, తల్లిదండ్రులు లేదా అధికారికంగా అనుమతించిన సంరక్షకులతో మాత్రమే వారిని బయటకు పంపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని కిచెన్ షెడ్, స్టోర్‌రూమ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్, నిల్వ ఉంచిన సరుకులను, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలోని సీసీ కెమెరాల పనితీరును, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. [caption id="attachment_2436272" align="alignnone" width="1200"] 'పాఠశాలల్లో మౌలిక వసతులు, భోజన నాణ్యతపై రాజీ పడొద్దు'[/caption] జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల నమోదు, హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తనిఖీ చేయగా, పప్పు పలుచగా ఉండటంతో పాటు భోజనంలో నాణ్యత లోపించినట్లు గుర్తించి తీవ్ర
