పాఠశాలలను సందర్శించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి
Actor ProfileCelebrity

పాఠశాలలను సందర్శించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి

Total News1
Movie Updates0
Sources1
పాఠశాలలను సందర్శించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి
Namasthe Telangana17 Jun 2026
పాఠశాలలను సందర్శించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి

తిమ్మాపూర్, జూన్17: పాఠశాలలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమైన సందర్భంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని పలు గ్రామాల లో ప్రభుత్వ పాఠశాలలను తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. మల్లాపూర్, రేణికుంట గ్రామాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, అన్ని ఉచితంగా వస్తాయని.. తమ స్నేహితులకు తెలిపి ప్రైవేట్ స్కూల్స్‌లో చదివే వారిని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు