ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విద్యార్థుల సర్టిఫికెట్లు, పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లపై పుట్టుమచ్చల్ని నమోదు చేసే అంశంపై పిల్ దాఖలైంది. ఇలా విద్యార్థుల పుట్టుమచ్చలు నమోదు చేయడం వ్యక్తిగత గోప్యతను

పుట్టుమచ్చ

తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు వంశీ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తమ మార్క్ సినిమాలతో వంశీ ఎన్నో వండర్స్ చేశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో లేడీస్ టైలర్ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా వెనుక వంశీ కెరీర్ ప్రయాణం, అనేక ఆసక్తికర సంఘటనలు దాగి ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ లేడీస్ ట్రైలర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి గారితో మంచుపల్లకితో దర్శకుడిగా పరిచయం అయిన వంశీ, ఆ తర్వాత సితార, అన్వేషణ వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఆలాపన వంటి ప్రయోగాత్మక చిత్రం వాణిజ్యపరంగా నిరాశపరిచింది. ఈ సమయంలో, వంశీ తన తదుపరి సినిమాపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. నిర్మాత వేమూరు సత్యనారాయణ, శ్రావంతి రవికిషోర్ వంటి నిర్మాతలు వంశీని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా క్రైమ్ థ్రిల్లర్ సౌందర్య లహరి కథతో కమలహాసన్‌ను కలిసినా, ఆయన డేట్లు అందుబాటులో లేకపోవడంతో వంశీ మళ్ళీ మొదటికి వచ్చారు. ఈ క్రమంలో, తనికెళ్ళ భరణితో కలిసి విజయవాడలో కొత్త కథా చర్చలు జరుపుతున్నప్పుడు, రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుకోకుండా కనిపించిన ఒక సిగరెట్ ప్యాకెట్‌పై లేడీస్ టైలర్ అనే పేరును రాసి, దానిని సినిమా టైటిల్‌గా రిజిస్టర్ చేయించారు. అక్కడి నుంచి లేడీస్ టైలర్ కథా ప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ను హీరోగా ఎంచుకోవడానికి వంశీ గారు పట్టుబట్టారు. రాజేంద్ర ప్రసాద్ కి అప్పటికే మంచుపల్లకిలో ఒక పాత్ర ద్వారా వంశీకి పరిచయం ఉంది. సినిమాలో ముఖ్యమైన "కుడి తొడ మీద పుట్టుమచ్చ