
ఎన్నో సివిల్స్ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో మరోసారి సివిల్స్‌కి సన్నద్ధమైంది. కానీ ఈ సారి వరుస వైఫల్యాలు ఎదురవ్వుతున్న వెనక్కి తగ్గకుండా ప్రయత్నించి ఐఏఎస్ అధికారి అయ్యింది. అపజయం అంటే విజయానికి ముగింపు కాదని..ప్రయత్నం ఆపకపోవడం అని చాటిచెప్పి సివిల్స్ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే కేరళకు చెందిన కాజల్ రాజు. ఆమె పుట్టుకతో ఫోకోమెలియా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కారణంగా కుడి ముంజేయి లేకుండా జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి చదువులో ముందంజలో ఉండేది. అలా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన ఐఐటి మద్రాస్‌లో డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిందామె. అయితే క్యాంపస్‌లో ఉన్నప్పుడే ప్రజసేవపై మక్కువ ఏర్పడింది. అలా సివిల్స్ వైపు అడుగులు వేసింది. అయితే తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుని ఆల్ ఇండియా 910వ ర్యాంకు దక్కించుకుని ఐఆర్‌ఎస్‌కు ఎంపికైంది. అయితే కాజల్ అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరడమే లక్ష్యంగా మరోసారి సివిల్స్‌కి సన్నద్ధమైంది. ఈసారి మరింతగా ర్యాంకును మెరుగుపరుచుకోవాలనుకుంటే..మరింతగా ర్యాంకు దిగజారగా, మూడోసారి ఏకంగా ప్రిలిమ్స్‌లోనే ఓటమిని చవి చూసింది. నిజానికి ఈ వరుస వైఫల్యం ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయేలా చేస్తుంది. కానీ కాజల్ మరింతగా బలంగా ప్రిప్రేరవ్వాలన్న కసి అంతకంతకు పెరిగింది. అలా ఆమె సివిల్స్‌లో చివరికి ఆల్ ఇండియా ర్యాంక్ 167కి మెరుగుపరుచుకుని ఐఏఎస్ అధికారి అయ్యింది. ఇక్కడ కాజల్‌కి రైల్వే సర్వీస్ శిక్షణ, యూపీఎస్సీ ప్రిపరేసన్ అత్యంత సవాలుగా మారింది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చదవడం అత్యంత కష్టంగా ఉన్నా..ఏదోరకంగా ప్రిపరేషన్ కొనసాగించేది. తనకు ఏ కాస్త చిన్న సమయం దొరికినా..పుస్తకాలతో కుస్తీ పట్టేది. అంతేగాదు ఉద్యోగ బిజీ షెడ్యూల్‌ని, ప్రిపరేషన్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి