
భారతీయ సినిమా ఇండస్ట్రీలో 90వ దశకాన్ని సంగీత స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆ కాలంలోని పాటలు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రేడియోల్లోనూ, క్యాసెట్ల ద్వారా ప్రతి వీధిలోనూ ఈ పాటలు వినిపించేవి. అలా ఆనాటి పాటల్లో కొన్నీ ఇప్పటికీ సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. అలాంటి కాలాతీతమైన పాటల్లో ఒకటి ‘పరువం వానగా నేడు కురిసేనులే’. 1992లో వచ్చిన ‘రోజా’ చిత్రంలోని ఈ ప్రేమ గీతం ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ప్రముఖ గాయకులు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర తమ అందమైన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ రోజా సినిమాకు సంగీతం అందించడం మరో విశేషం. రోజా సినిమాలోని ఈ రొమాంటిక్ సాంగ్ ను కశ్మీర్‌లో చిత్రీకరించారు. అక్కడి ప్రకృతి రమణీయమైన పరిసరాలు, మంచుతో కప్పబడిన లోయలలో ఈ సాంగ్ ను షూట్ చేశారు. దీంతో ఈ పాట మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ అందమైన పాటలో హీరో, హీరోయిన్లు అరవింద్ స్వామి మధు బాల మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ కూడా హైలెట్ అని చెప్పవచ్చు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ లిరిక్స్, మ్యూజిక్ తో సాగే ఈ పాట సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగు సినిమాల్లోని బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఈ పాటను ఒకటిగా పరిగణిస్తారు. ఈ పాటను ఇప్పటికీ సోషల్ మీడియాలో, వివిధ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వింటున్నారు. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన రోజా చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సుమారు రూ. 12 కోట్లు వసూలు చేసింది. దేశభక్తి నేపథ్యంలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను