
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె పేరు మరో బడా ప్రాజెక్ట్ లో వినిపిస్తోంది. అవును ఆమెని పవన్ కళ్యాణ్ సరసన నటింపచేసే ఆలోచనలో ఉన్నారట. ఓజీ మొదటి భాగంలో ప్రియాంక మోహన్ నటించింది. ఆ సినిమాలో ఆ పాత్ర చనిపోయింది. అంటే రెండో భాగంలో ప్రియాంక మోహన్ కనిపించే ఛాన్స్ లేదు. అందుకే మరో కొత్త పాత్రలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేని తీసుకుంటారు అని అంటున్నారు. ప్రస్తుతం సుజీత్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సంగీత దర్శకుడు తమన్ కూడా తన పని మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ కి చెందిన నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. కానీ పూజ హెగ్డే నిజంగానే ఈ సినిమాలో నటిస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం ఈ భామ తెలుగులో దుల్కర్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో ఒక సినిమా ఉంది. ఇక ఆమె విజయ్ తో నటించిన “జన నాయగన్” ఇంకా విడుదలకు నోచుకోలేదు